Breaking News

అఖండ 2 కేవలం తెలుగు సినిమా కాదు

Published on Mon, 12/15/2025 - 05:03

‘అఖండ 2: తాండవం’ కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు. భారతీయ చిత్రం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు సంబంధించిన సినిమా ఇది. సనాతన హైందవ ధర్మం పరాక్రమాన్ని చూపించిన చిత్రం. ఈ సినిమా చూశాక సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని అందరూ అంటున్నారు’’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. 

సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్‌ ఆంచట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఆదివారం యూనిట్‌ నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకువెళ్లిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మన సినిమాను గెలుపించుకోవాలని ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఆర్టిస్టు, టెక్నిషియన్ కు థ్యాంక్స్‌. 

ఆ శివుడే మా వెనకాల ఉండి నడిపించాడు’’ అన్నారు. ‘‘అఖండ 2’కు మ్యూజిక్‌ ఇవ్వడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా సక్సెస్‌ అవుతుందని ధైర్యంగా అనుకున్నాం’’ అని చెప్పారు తమన్ . ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘బోయపాటిగారు బాలకృష్ణగారిని ఇండియన్  సూపర్‌ హీరో చేశారు. దైవంతో కూడిన ఒక క్యారెక్టర్‌ను డిజైన్  చేసి, ఒక సూపర్‌ హీరోని చేయడం అది బాలకృష్ణ, బోయపాటిగార్లకే చెల్లింది. తెలంగాణలో రిలీజ్‌ చేసిన మాకు మూడో రోజుకే మేం పే చేసిన దానికి 70 శాతం రెవెన్యూ రికవరీ అయ్యింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఇండస్ట్రీలో కీలకమైన వ్యక్తిగా నాకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో విజీ చంద్రశేఖర్, గంగాధర శాస్త్రి, కల్యాణ్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)