Breaking News

థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా 1920

Published on Fri, 06/16/2023 - 00:04

‘‘నాకు హారర్‌ సినిమాలు చూడాలంటే భయం. కానీ ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ సినిమా చూడాలనిపిస్తోంది. చూడాలని పించేలా ఈ సినిమాను చేశారు’’ అన్నారు నాగార్జున. అవికా గోర్, రాహుల్‌ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్‌ పండోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’. దర్శక–నిర్మాత మహేశ్‌భట్‌ రచన, సమర్పణలో కృష్ణాభట్‌ దర్శకత్వంలో రాకేష్‌ జునేజా,
శ్వేతాంబరీ భట్‌ డా.రాజ్‌కిషోర్‌ ఖవ్రే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.

ఈ సందర్భంగా జరిగిన ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘మహేశ్‌భట్‌గారు చాలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ‘తెలుసా మనసా’ (‘క్రిమినల్‌’) పాటను ఆయన చేయించుకున్న విధానం నాకిప్పటికీ గుర్తు ఉంది. ఇక ‘1920’ ట్రైలర్‌ బాగుంది. ఇలాంటి సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. అవికా కెరీర్‌లో ఈ సినిమా పెద్దహిట్‌గా నిలవాలి. అలాగే ఇవాళ ఒక పెద్ద సినిమా ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా అందరినీ మళ్లీ థియేటర్‌లోకి తీసుకు రావాలి.. జై శ్రీరామ్‌’’ అన్నారు నాగార్జున.

‘‘నాగార్జునగారి వల్లే ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ను తెలుగులో విడుదల చేస్తున్నాం. వాళ్ల నాన్నగారి విలువలు, సంస్కారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు నాగార్జున. విలువలు, సంస్కారం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ‘1920’ సినిమా కథ ఈ అంశాల గురించే’’ అన్నారు మహేశ్‌భట్‌. ‘‘నా తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ నుంచి నాగార్జునగారు నన్ను సపోర్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు హిందీలో నా తొలి చిత్రం ‘1920’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌కు ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. ‘1920’ నా కెరీర్‌లో స్పెషల్‌ మూవీ’’ అన్నారు అవికా గోర్‌. ‘‘ఇదొక ఎమోషనల్‌ లవ్‌స్టోరీ. హారర్‌లో ఎమోషన్ ను ప్రయత్నించడం ఇదే తొలిసారి’’ అన్నారు కృష్ణాభట్‌.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)