Breaking News

బిగ్‌బాస్‌ షో హోస్టింగ్‌కు నాగార్జున గుడ్‌బై!

Published on Fri, 12/16/2022 - 21:22

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ ఎప్పుడు ఎటు వైపు వెళ్తుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు అనుకున్నవారు ఎప్పుడో ఎలిమినేట్‌ అవగా గ్రాండ్‌ ఫినాలే వీక్‌లో మరొకరిని పంపించి ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్‌. మరోపక్క  ఈ సీజన్‌లో చాలావరకు అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్స్‌ జరిగాయంటూ నెటిజన్లు నెట్టింట మండిపడ్డ విషయం తెలిసిందే! మరీ ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్‌తో ఈ ఆగ్రహం పీక్స్‌కు వెళ్లింది.

అయితే దీనిపై నాగార్జున కూడా సీరియస్‌ అయ్యాడని, ఇక మీదట బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పాడంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  అంతేకాదు నెక్స్ట్‌ సీజన్‌కు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హోస్ట్‌గా రానున్నాడన్న ప్రచారమూ ఊపందుకుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.

కానీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి షోకి ఆదరణ తగ్గడమే కాక విమర్శలు ఎక్కువయ్యాయన్నది జగమెరిగిన సత్యం. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్‌ లాంఛింగ్‌ ఎపిసోడ్‌కే అతి తక్కువ(8.5) టీఆర్పీ వచ్చింది. దీనిపై నాగ్‌ సైతం కొంత అప్‌సెట్‌ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సీజన్‌లో మలుపులు, అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్లు టీఆర్పీకి గుదిబండగా మారాయి. అటు ప్రేక్షకులు సైతం ఈ సీజన్‌ను ఫ్లాప్‌ సీజన్‌గా తేల్చేశారు. కనీసం నెక్స్ట్‌ సీజన్‌కైనా మంచి కంటెస్టెంట్లను, ఫెయిర్‌ ఎలిమినేషన్లు పెట్టండని చురకలంటిస్తున్నారు.

చదవండి: రేవంత్‌ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని చెప్పాం
త్వరలో కొత్త జీవితం ప్రారంభిచబోతున్నా: మంచు మనోజ్‌

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)