Breaking News

'శివ' రీ-రిలీజ్‌.. సైకిల్‌ చైన్‌తో రెడీగా ఉండండి: నాగార్జున

Published on Sat, 09/20/2025 - 11:33

అక్కినేని నాగార్జున నటించిన చిత్రాల్లో 'శివ' చాలా ప్రత్యేకం. ఈ చిత్రం రీరిలీజ్‌ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సినిమాతో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్‌ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్‌ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్‌ చేసిన రామ్‌గోపాల్‌ వర్మ అక్కడ కూడా హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో  మరోసారి వెండితెరపైకి రానుంది.

35 ఏళ్ల తర్వాత ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు (సెప్టెంబర్‌ 20) అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా శివ రీరిలీజ్‌ విడుదలను నాగార్జున ప్రకటించారు. నవంబర్‌ 14న శివ వస్తున్నాడంటూ నాగ్‌ ఒక పోస్టర్‌తో ప్రకటించారు. మరోసారి సైకిల్‌ చైన్‌ చేతికి చుట్టి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు సాధించేందుకు  శివ రానున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సైకిల్‌ చైన్‌ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్‌ సెట్‌ చేసిన చిత్రం ‘శివ’. 

నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించారు.  కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)