Breaking News

అయోత్తి రీమేక్‌లో?

Published on Wed, 07/09/2025 - 00:37

తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున చేసిన ‘కుబేర’ సినిమా ఈ జూన్‌ 20న విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించగా, ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే నాగార్జున వందో సినిమా పనులు తమిళ దర్శకుడు ఆర్‌.ఎ. కార్తీక్‌తో జరుగుతున్నాయి.

కాగా తాజాగా శశికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘అయోత్తి’ పట్ల నాగార్జున ఆసక్తిగా ఉన్నారట. 2023లో విడుదలై, ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని నాగార్జున ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ రీమేక్‌ వార్త నిజమే అయితే ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణం వరకే పరిమితమవుతారా? అనేది చూడాలి. ఇక ‘అయోత్తి’ కథ విషయానికి వస్తే... ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జీవించే బలరాం తీర్థయాత్ర కోసం తమిళనాడులోని రామేశ్వరానికి వెళతాడు.

కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో బలరాం భార్య జానకి, కూతురు శివానీ గాయపడతారు. చికిత్స తీసుకుంటూనే జానకి మరణిస్తుంది. దీంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు తీసుకెళ్లాలని బలరాం అనుకుంటాడు. కానీ అతనికి అనుకోని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను ఎదుర్కొని, అబ్దుల్‌ మాలిక్‌ అనే వ్యక్తి సాయంతో జానకి మృతదేహాన్ని అయోధ్యకు బలరాం ఎలా తీసుకుని వెళ్లాడన్నదే ‘అయోత్తి’ సినిమా.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)