అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
Breaking News
నాగార్జున 100వ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..!
Published on Sat, 03/28/2026 - 12:10
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వందో చిత్రం షూటింగ్ పనులు మొదలయ్యాయి. తమిళ దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. త్వరలో సినిమా టైటిల్‌ను ప్రకటిస్తారు. అయితే, ఈ మూవీలో నాగార్జున సరసన నటించబోయే హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని అభిమానులు ఎదురుచూస్తుండగా ఒక నటి పేరు వైరల్ అవుతుంది.
నాగార్జున 100వ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో మూవీ సెట్స్‌లో కూడా ఆమె పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన తన వందో చిత్రాన్నీ తనదైన శైలిలో రా.కార్తీక్ ప్లాన్ చేసినట్లు టాక్. యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, భావోద్వేగ అంశాలతో ఈ మూవీ ఉండనుందట. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తుంది.

తెలుగు మూలాలు ఉన్న నటి ఐశ్వర్య రాజేష్.. తమిళం, తెలుగు చిత్రాల్లో మెప్పిస్తూ.. తన అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నైలో జన్మించిన ఈమె, యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, రియాలిటీ షో విజేతగా నిలిచి, ఆపై సినిమాల్లోకి ప్రవేశించారు. గ్లామర్ పాత్రల కంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గతేడాది వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అలరించారు.
Tags : 1