Breaking News

అతనికి ఏ సాయం కావాలన్నా చేస్తానని ముందే చెప్పా: నాగశౌర్య

Published on Thu, 07/06/2023 - 04:22

‘‘రంగబలి’ మంచి మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమా చూస్తున్నంత సేపు సొంత ఊరు గుర్తొస్తుంది. ఆ ఊరిని మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్‌ కలిగి ఓసారి ఊరెళ్లి వద్దామనే ఆలోచన కలుగుతుంది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు.

► నటుడికి దర్శకుడు స్పేస్‌ ఇవ్వాలి. ఆ స్పేస్‌ని పవన్‌ నాకు ఇచ్చాడు. దర్శకునిగా తనకు తొలి సినిమా కాబట్టి ఏ విషయంలోనూ ఒత్తిడి తీసుకోవద్దని, ఏ సాయం కావాలన్నా చేస్తానని ముందే చెప్పాను. నా అనుభవాన్ని, పవన్‌ విజన్‌ని జోడించి అనుకున్నది అనుకున్నట్లుగా ‘రంగబలి’ లాంటి ఓ మంచి సినిమా తీశాం.

► ‘రంగబలి’ ప్రివ్యూ చూశాకే ప్రమోషన్స్ స్టార్ట్‌ చేస్తానని దర్శక–నిర్మాతలకు చెప్పాను. చూసిన తర్వాత చాలా మంచి మూవీ చేశామనే అనుభూతి కలిగింది. అందుకే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రేక్షకులకు నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. సుధాకర్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ‘రంగబలి’ తీశారు. ఈ మూవీతో పవన్‌కి మంచి పేరొస్తుంది. యుక్తి తరేజ మంచి యాక్టర్‌ అండ్‌ డ్యాన్సర్‌. తెలుగులో లీడింగ్‌ హీరోయిన్‌ అయ్యే అవకాశాలు తనకు చాలా ఉన్నాయి. పవన్‌ సంగీతం, నేపథ్య సంగీతాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తారు.

► ఇప్పుడున్న పోటీలో హీరోలందరూ అద్భుతమైన నటన, డ్యాన్స్, యాక్షన్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నేనూ ది బెస్ట్‌ ఇవ్వాలి. ఈ క్రమంలో ఒక్కోసారి గాయాలవుతాయి. కష్టపడితేనే సక్సెస్‌ వస్తుంది.

► ఏప్రొడక్షన్‌ హౌస్‌లోనైనా పది హిట్స్‌ పడిన తర్వాత కూడా ఒక సినిమా నిరాశ పరిస్తే దాన్ని రికవర్‌ చేయడం అంత తేలిక కాదు. సినిమా అంటే మాకు పిచ్చి.. ఫ్యాషన్‌తోనే మా ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నాం తప్ప డబ్బులు సంపాదించుకోవాలని కాదు. మాకు సినిమా తప్పితే వేరేది తెలియదు. ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. నేను నటిస్తున్న 24వ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)