Breaking News

బిగ్గెస్ట్‌ మైల్‌స్టోన్‌‌ చేరుకున్న 'తండేల్‌'.. నాగచైతన్యకు ఫస్ట్‌ సినిమా

Published on Sun, 02/16/2025 - 19:16

తండేల్‌ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్‌ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నాగ చైతన్య కెరీర్‌లో వంద కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది.

తండేల్‌ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్‌ దాటింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.  ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన తండేల్‌.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్‌ చూపింది. ఈ చిత్రం HD వెర్షన్ సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్‌లో చేరడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్‌లో 1 మిలియన్  దాటింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభదాయకమైన వెంచర్‌ అయ్యింది. ఇప్పటికే బ్రేక్‌ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.

పద్నాలుగు నెలలు పాకిస్తాన్‌ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్‌’ చిత్రానికి ప్రేక్షకులు క్యూ కట్టేశారు.. శ్రీకాకుళం,విజయనగరం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్‌ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపలేదని వారు వాపోయిన విషయం తెలిసిందే.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)