Breaking News

కాంబినేషన్‌ కుదిరేనా?

Published on Fri, 07/11/2025 - 00:55

హీరో నాగచైతన్య–తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ కాంబినేషన్‌లో ఓ స్పై డ్రామా చిత్రం తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని కోలీవుడ్‌ సమాచారం. తమి ళంలో ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), ‘సర్దార్‌’ వంటి హిట్‌ సినిమాలను తీసిన దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ ఇటీవల ఓ స్పై కథను నాగచైతన్యకు వినిపించారని, ఈ కథకు నాగచైతన్య అంగీకారం తెలిపారని భోగట్టా.

దీంతో దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ ఈ సినిమా స్క్రిప్ట్‌కి మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని, ఈ పని పూర్తయిన తర్వాత నాగచైతన్యకు మరోసారి కథ వినిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరి... నాగచైతన్య–పీఎస్‌ మిత్రన్‌ల కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. మరోవైపు ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ వర్మ దండు డైరెక్షన్‌లో ‘వృషకర్మ’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా చేస్తున్నారు నాగచైతన్య. అలాగే కార్తీ ‘సర్దార్‌ 2’ పోస్ట్‌  ప్రోడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నారు పీఎస్‌ మిత్రన్‌. వీరి ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్‌లోని సినిమాపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)