Breaking News

చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?

Published on Fri, 08/09/2024 - 14:03

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ శుభకార్యం జరిగింది. బహుశా ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు. ఎంగేజ్‍మెంట్ జరగడం మాటేమో గానీ శోభిత ఎవరు? తొలిసారి వీళ్లిద్దరూ ఎక్కడ కలిశారు? అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

నాగచైతన్య విషయానికొస్తే.. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే హీరోయిన్ సమంతని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నాడు. కారణాలు తెలియవు కానీ వివాహ బంధంలో కలతలు రావడంతో 2021 అక్టోబరు 2న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన దాదాపు మూడేళ్లకు నటి శోభిత ధూళిపాళ్లతో చైతూ నిశ్చితార్థం జరిగింది.

(ఇదీ చదవండి: Samantha: హార్ట్‌ బ్రేక్‌ అయింది.. సమంత పోస్ట్‌ వైరల్‌)

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టిన శోభిత.. వైజాగ్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. తండ్రి మర్చంట్ నేవీ ఇంజినీర్ కావడంతో ముంబయిలో స్థిరపడింది. బాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో అడివి శేష్ 'గూఢచారి', 'మేజర్' సినిమాల్లో మాత్రమే నటించింది. హీరోయిన్‌గా కంటే నటిగానే ఈమె గుర్తింపు తెచ్చుకుంది. 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటించింది. హాలీవుడ్‌లోనూ 'మంకీమ్యాన్' అనే సినిమాలో నటించింది.

'మేజర్' షూటింగ్ జరుగుతున్న టైంలోనే చైతూ-శోభితకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ గతేడాది ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అయితే అక్కడి చెఫ్ పోస్ట్ చేసిన ఫొటోల వల్ల వీళ్ల డేటింగ్ బయటపడింది. ఇన్నాళ్లకు బంధాన్ని నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు.

(ఇదీ చదవండి: థియేటర్‌లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)