Breaking News

అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'తండేల్‌' విడుదలపై ప్రకటన

Published on Tue, 11/05/2024 - 16:37

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న 'తండేల్' సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే, పలు కారణాల వల్ల ఈ అవకాశం లేకుండాపోయింది. దీంతో మరో తేదీకి తండేల్‌ వస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియ రేంజ్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

'తండేల్' సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్‌కు నిర్మాత అల్లు అరవింద్‌  గుడ్‌న్యూస్‌ చెప్పారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్‌, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొదట డిసెంబర్‌ 28న 'తండేల్'  విడుదల చేయాలనుకుంటే కుదరలేదని ఆయన చెప్పారు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్‌ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు అరవింద్‌ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో  శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జ‌రిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది.  శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాల‌రి   పొర‌పాటుగా పాకిస్థాన్ స‌ముద్ర‌జ‌లాల్లోకి ప్ర‌వేశించాడు. దీంతో పాక్‌ నేవి అధికారులు అరెస్ట్‌ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్‌ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)