Breaking News

నా ఇంట్లో రూలింగ్‌ పార్టీ వైజాగే: నాగచైతన్య

Published on Wed, 01/29/2025 - 08:29

నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్‌ రోడ్డులోని శ్రీరామ పిక్చర్‌ ప్యాలెస్‌లో నిర్వహించింది చిత్రం యూనిట్‌. ఈ వేడుకలో నాగచైతన్య 

మాట్లాడుతూ– ‘‘మన పుష్పకా బాప్‌ అల్లు అరవింద్‌గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్‌ ఆయనే. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన గైడెన్స్‌ చాలా విలువైనది. ఏ సినిమా రిలీజ్‌ తర్వాత అయినా వైజాగ్‌ టాక్‌ ఏంటి? అని కనుక్కుంటాను. ఎందుకంటే... వైజాగ్‌లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్‌ నాకు ఎంత క్లోజ్‌ అంటే నేను వైజాగ్‌ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు... నా ఇంట్లో కూడా వైజాగ్‌ ఉంది. నా ఇంట్లో రూలింగ్‌ పార్టీ వైజాగే. ‘తండేల్‌’(Thandel) సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్‌ షేక్‌ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది (సరదాగా). దద్దా... గుర్తెట్టుకో... ఈ పాలి యాట గురి తప్పేదేలేదేస్‌. ఫిబ్రవరి 7న రాజులమ్మ జాతరే’’ అని అన్నారు.

 అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథను సినిమాగా తీశాం. నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు 
నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్‌ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ కథను చందు మొండేటి అత్యద్భుతంగా మలిచి, చాలా బాగా తీశారు. సాయిపల్లవిగారు అద్భుతంగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ చించిపడేశాడు’’ అని తెలిపారు. 

తండేల్‌ ట్రైలర్‌ విషయానికొస్తే.. నాతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది. తండేల్ అంటే లీడర్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి  వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి. మొత్తం ట్రైలర్ ఒక పవర్ ప్యాక్డ్‌గా ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు రప్పించేలా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)