Breaking News

నాని, విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ వార్‌పై నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Tue, 03/18/2025 - 18:52

సోషల్‌ మీడియాలో హీరో అభిమానుల మధ్య యుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. టీజర్‌, ట్రైలర్‌ మొదలు సినిమా రిలీజ్‌ వరకు ప్రతీది పోల్చుతూ హీరో ఫ్యాన్స్‌ ఏదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. అయితే హీరోలు మాత్రం అవేవి పట్టించుకోకుండా కలిసి మెలిసే ఉంటారు. అయితే ఈ ఫ్యాన్స్‌ వార్‌ అనేది ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా పెరిగిపోయింది.నాని, విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ మధ్య నెట్టింట పెద్ద యుద్ధమే జరుగుతోంది. తాజాగా దీనిపై  ‘కల్కి’ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) స్పందించారు.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నాని(nani), విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) కలిసి నటించిన  ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీ ఈ నెల 21న రీరిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ మీడియాతో ముచ్చటిస్తూ పదేళ్ల క్రితం తెరకెక్కించిన ఆ సినిమా సంగతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘సోషల్‌ మీడియాలో నాని, విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా చేయగలరా?’ అని ఓ విలేకరి అడగ్గా నాగ్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ‘ఫ్యాన్స్‌ వార్‌ గురించి తెలియదు కానీ, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో విజయ్‌కు నాని సపోర్ట్‌గా నిలిచేవాడు. ప్రతి సన్నివేశాన్ని ఒకరికొకరు చర్చించుకుని నటించేవారు’ అన్నారు.  

అలాగే నాని, విజయ్‌తో కలిసి మళ్లీ ఇలాంటి సినిమా చేసే ఆలోచన ఉందా? అని అడగ్గా.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితో సినిమా చేయలేం. నా నాలుగో సినిమాని మళ్లీ ఇలాంటి నేపథ్యంతో తీస్తే.. అది ఇంత బాగా రాకపోవచ్చు. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. ఇంత నేచురల్‌గా తీయడం సాధ్యంకాకపోవచ్చు’ అన్నారు. ఎవడే సుబ్రమణ్యంలోని నాని పాత్రను ఇప్పుడున్న యంగ్‌ హీరోలలో నవీన్‌ పొలిశెట్టి చేయగలడని, విజయ్‌ పాత్రను పోషించాలంటే కొత్త హీరో కావాల్సిందేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)