Breaking News

‘నా తెలుగోడు ’లో ఆ నాలుగు అంశాలు చూపించబోతున్నాం

Published on Wed, 12/10/2025 - 16:23

హరనాథ్ పోలిచర్ల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నా తెలుగోడు’. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రీరీలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా హరనాథ్ పోలిచెర్ల మాట్లాడుతూ... తెలుగోడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎలా మంచి కోసం పోరాడేవాడు, ప్రతిభావంతుడు, కష్టపడేవాడు అనేది ఈ సినిమాలో చూపించాను. ఈ సినిమాలో ప్రత్యేకంగా నాలుగు అంశాలను చూస్తాం. అమ్మ గురించి, డ్రగ్స్ పై అవగాహన, సైనికుడు జీవితం గురించి, బాల శిశువులను కాపాడే ప్రయాణం పై ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ అంశాలు అన్నింటినీ ప్రేక్షకులకు అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూస్తాం. 

ఈ సినిమా కోసం నా చిత్ర బృందం అందరూ నాకు ఎంతో అండగా నిలబడ్డారు. శివ మంచి సంగీతాన్ని అందించారు. ప్రేక్షకులు అందరూ డిసెంబర్ 12వ తేదీన సినిమాను చూసి, సినిమాలోని అంశాలను మీ మనసులోకి తీసుకుంటారు అని కోరుకుంటున్నాను’ అన్నారు.  

హీరోయిన్ సుఫియా తన్వీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను పాత్ర పోషించడం కాదు, జీవించాను. ఈ పాత్ర పోషించినందుకు గాను నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రేక్షకులు అంతా ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.

‘ఈ చిత్రంలో నా పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. కాబట్టి నా పాత్ర గురించి బయటకు ఏమి చెప్పలేకపోతున్నాను’అని హీరోయిన్‌ నైరాపాల్‌ అన్నారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు