Breaking News

‘నా సామిరంగ’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Sun, 01/14/2024 - 07:34

ఈ సంక్రాంతి బరిలో చివరిగా వస్తున్నాడు నాగార్జున. ‘ది ఘోస్ట్‌’ తర్వాత కింగ్‌ నటించిన చిత్రం ‘నా సామిరంగ’.మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. సంక్రాంతి బరిలో  నాలుగు సినిమాలు ఉన్నా.. తమదే అచ్చమైన పండగ సినిమా అని ముందు నుంచి చిత్ర యూనిట్‌ బలంగా చెబుతోంది. ఆ దిశగానే ప్రమోషన్స్‌ కూడా గట్టిగానే చేసింది.

భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నా సామిరంగ కథేంటి? ఎలా ఉంది? నాగార్జున ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు. 

‘నా సామిరంగ’ చిత్రానికి ట్విటర్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని, నాగార్జున హిట్‌ కొట్టాడని కొంతమంది కామెంట్‌ చేస్తుంటే.. సినిమా యావరేజ్‌ అని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. 

ఫస్టాఫ్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌ అంచనాలను మించి పోయింది. చాలా కాలం తర్వాత నాగార్జునకు ఓ భారీ హిట్‌ పడింది. అల్లరి నరేష్‌ కూడా ర్యాంప్‌ ఆడించాడు అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

సామిరంగ మూవీ ఫస్టాఫ్‌ ఇప్పుడే ఫినిష్‌ అయింది. అన్ని రకాల ఎమోషన్స్‌తో ప్రథమార్థం ముగిసింది. నాగార్జున మాస్‌ ఫైట్‌ అదిరిపోయింది. లవ్‌స్టోరీ బాగుంది. ఇంటర్వెల్‌ ఒక సీన్‌ రిపీట్‌ అవుతుంది.  ఓవరాల్‌గా సినిమా సూపర్‌ హిట్‌ అని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)