Breaking News

హను-మాన్‌ కోసం రెండేళ్లు కష్టపడ్డా: సంగీత దర్శకుడు

Published on Wed, 01/10/2024 - 15:56

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ అండ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం హను-మాన్‌. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ట్రైలర్‌ విడుదలయ్యాక ప్రతి ఒక్కరు బీజీఎం బాగుందని కామెంట్‌ చేశారు. వాస్తవానికి ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్లు పని చేశారు.సంగీత దర్శకులు అనుధీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్‌ చేశారు. ఇక మిగిలిన పాటలను, నేపథ్య సంగీతాన్ని గౌర హరి అందించాడు.

ఆయన అందించిన నేపథ్య సంగీతంపై చిత్ర యూనిట్‌తో పాటు సీనీ ప్రియులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రాణం పెట్టి సంగీతం అందించానని చెబుతున్నాడు గౌరహరి. దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి సంగీతాన్ని సమకూర్చారట. ఇప్పటి వరకు విడుదల అయిన బీజీఎమ్, హనుమాన్ చాలీసా ,శ్రీరామ దూత స్తోత్రం ,ఎంత ప్రభంజనం సృష్టించాయో మనకు తెలుసు. ఆ పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటే దానికోసం గౌర హరి ఎంత ఎఫర్ట్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.

డైరెక్టర్ విజన్ కు తగ్గట్టుగా, తీసిన విజువల్స్ ను మరోక మెట్టు ఎక్కించడంలో సంగీత దర్శకుడిగా గౌర హరి  వంద శాతం విజయం సాధించాడని చిత్ర బృందమే పేర్కొంది అంటే గౌరహరి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యాడ్స్, టీవీ సీరియల్స్‌తో ఆయన సంగీత ప్రస్థావన మొదలు పెట్టి నేడు పాన్ ఇండియా సినిమా హనుమాన్‌కు పనిచేసే స్థాయికి ఎదిగారు గౌరహరి. మరి ఈ చిత్రంతో గౌరహరి పాన్‌ ఇండియా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతారో లేదో చూడాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)