ఛావాను వదలని కేటుగాళ్లు.. కేసు నమోదు

Published on Fri, 03/21/2025 - 17:39

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ జీవితంగా ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. నెల రోజులైనా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు వసూళ్లు సాధించింది.

అయితే గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సూపర్ హిట్ సినిమా ఛావాను కూడా పైరసీ చేశారు కేటుగాళ్లు. దీంతో ఛావా మేకర్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆగస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ శ్రీ రజత్ రాహుల్ హక్సర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇప్పటికే పలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఛావాను ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మేకర్స్. నిర్మాణ సంస్థ మడ్‌హాక్‌ ఫిల్మ్స్‌ ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ ఏజెన్సీ పైరసికీ సంబంధించిన ఇంటర్నెట్‌ లింకులను పోలీసులకు సమర్పించింది. దీనిపై ముంబయిలోని సౌత్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)