Breaking News

పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్‌ కామెంట్స్‌

Published on Tue, 09/13/2022 - 16:19

‘సీతారామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠి బ్యూటీ మృణాల్‌ ఠాకుర్‌. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో ఆమె ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చెరిపోయింది. అందం, అభినయం, తనదైన నటనతో తొలి చిత్రంతోనే ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన ఆమెకు ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పెళ్లి కాకపోయిన పిల్లల్ని కంటాను అంటూ చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి.  

చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల ఏం చేస్తుంటారో తెలుసా?

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. 30 ఏళ్ల వయసున్న స్త్రీలు డేటింగ్, ప్రేమ, పెళ్లి, పిల్లలు గురించి ఆసక్తిగా ఉండరు అనే అంశంపై స్పందించింది. ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికనప్పుడే పెళ్లి చేసుకుంటాను. నా మనసుని అర్థం చేసుకుని, నా మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వ్యక్తి నా జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. అతడు నా వృత్తిని కూడా గౌరవించాలి. మన చుట్టూ చాలా అభద్రత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రక్షణ కల్పించే వ్యక్తి కావాలి. అలాంటి వాళ్లు దొరకడం చాలా అరుదు. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకపోతే పెళ్లి చేసుకోను’ అని చెప్పుకొచ్చింది. 

చదవండి: టాలీవుడ్‌పై అమలా పాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సమాజంలో మహిళల జీవితాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లి, వయసు, సంతానం అంటూ అనేక ప్రశ్నలు వేస్తారు. అయితే నాకు పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ పిల్లలు అంటే ఇష్టం. అమ్మ అని పిలుపించుకోవాలని ఆశ. ఒకవేళ పెళ్లి చేసుకోకపోయిన నేను పిల్లల్ని కంటాను. అది టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ద్వారా. నా పిండాన్ని భద్రపరిచి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ద్వారా అమ్మను అవుతానని మా అమ్మకి చెబితే తాను కూడా ఓకే చెప్పింది. నా నిర్ణయాన్ని ఆమె సంతోషంగా స్వాగతించింది’ అంటూ మృణాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)