ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్

Published on Sun, 09/15/2024 - 14:40

వయసొచ్చిన తర్వాత చాలామంది ప్రేమలో పడుతుంటారు. ఇది సాధారణమైన విషయమే. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులేం కాదు. అయితే ప్రేమ ఎల్లకాలం ఉండదన్నట్లు బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని ఎవరూ పెద్దగా బయటపెట్టరు. కానీ 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ మాత్రం తనకు ఏడు నెలల క్రితం బ్రేకప్ జరిగిన విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన లవ్ స్టోరీస్ గురించి చెప్పింది.

'సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చేవరకు వచ్చివెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. మీకు ఎవరు సూట్ అవుతారనేది మీకే తెలుస్తుంది. అంతెందుకు నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా. కానీ నటితో డేటింగ్ అతడికి ఎందుకో ఇష్టం లేదు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దీంతో బ్రేకప్ చెప్పేసుకున్నాం. ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ అయింది. అయితే నన్ను చేసుకునేవాడికి లుక్స్ లేకపోయినా పర్లేదు కానీ మంచి మనిషి అయ్యిండాలి' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)

ఇప్పటివరకు తన జీవితంలో బ్రేకప్స్ జరిగాయి కానీ మరీ బాధపడిపోయేంతలా ఏం కాలేదని మృణాల్ చెప్పింది. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని పేర్కొంది. మరి మృణాల్ ఠాకుర్ మనసు గెలుచుకునేవాడు ఎక్కడున్నాడో ఏమో చూడాలి?

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకుర్.. హిందీలో పలు సినిమాలు చేసింది. 'సీతారామం' మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఫోకస్ అంతా హిందీపైనే ఉంది. తెలుగులో ఇ‍ప్పుడప్పుడే మూవీ చేస్తుందో లేదో డౌటే?

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం)

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)