Breaking News

ఆ హీరోని చూసి నా ఎక్స్‌ భాయ్‌ఫ్రెండ్‌ భయపడ్డాడు: మృణాల్‌ ఠాకూర్‌

Published on Thu, 02/19/2026 - 14:16

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ల సరసన నిలిచింది. ఆ తర్వాత హాయ్‌ నాన్నతో తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరైంది. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్‌తో పాటు  బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ..తన బ్రేకప్‌ స్టోరీని వివరిస్తూ.. కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కలిసి సూపర్‌ 30 సినిమా షూటింగ్‌లో పాల్గొనే సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌ అభద్రతా భావానికి గురయ్యాడని మృణాల్‌ వెల్లడించింది. అగ్రహీరోలతో నటించే అవకాశం రావడంతో.. ఎక్కడ తనని వదిలేస్తానేమో అనే భయంతో జిమ్‌కి వెళ్లి కండలు కూడా పెంచాడని, కానీ ఎంతో నిజాయితీగా ఉన్న ఆ బంధం నిలవలేదని మృణాల్‌ తెలిపింది.

‘కెరీర్‌ ప్రారంభంలో నేను షూటింగ్‌కి వెళ్లిన ప్రతిసారి నా బాయ్‌ఫ్రెండ్‌ ఆందోళనకు గురయ్యేవాడు. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన ప్రతిసారి తనను ఎక్కడ విడిచిపెడతానోనని.. తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించేవాడు. జిమ్‌కి వెళ్లి కండలు పెంచేవాడు. ఆ సమయంలో దాదాపు 15 కిలోలు తగ్గాడు. కానీ కొన్ని రోజులకు మళ్లీ బరువు అయ్యాడు. 

అతని వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఎందుకిలా చేస్తున్నావు అని అడిగితే.. ‘నీ చుట్టూ ఉండే హీరోలతో నేను కూడా పోటీ పడాలనుకున్నా. వాళ్లలాగా నేను కూడా అందంగా మారాలనుకున్నా. కానీ నావల్ల కాలేదు. అందుకే జిమ్‌ మనేశా’ అని చెప్పాడు.  అందం, ఫిట్‌నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం ఎంతటి మానసిక ఒత్తిడికి దారి తీస్తుందో ఆయనను చూస్తే అర్థమైంది. నేను ఎప్పుడూ అతడిని బరువు తగ్గమని లేదా మారమని అడగలేదు. కానీ తన చుట్టూ ఉన్న సినీ ప్రపంచమే అతడిలో అభద్రతా భావం పెంచింది. నేను ఎంతో నిజాయితీగా ఉన్నా.. ఆ బంధం నిలవలేకపోయింది’ అని మృణాల్‌ చెప్పుకొచ్చింది. కాగా, తాను సినిమాల్లో నటించడం ఇష్టంలేకనే బాయ్‌ఫ్రెండ్‌ బ్రేకప్‌ చెప్పాడని గతంలో ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూలో మృణాల్‌ చెప్పింది. 
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)