Breaking News

మృణాల్‌ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!

Published on Wed, 03/15/2023 - 19:56

బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్‌ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా సీతారామం సినిమాతోనే ఫేమ్ సంపాదించింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. అయితే తాజాగా మృణాల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

మృణాలు తన ఇన్‌స్టాలో వీడియో షేర్ చేస్తూ.. ' నా ఈ-మెయిల్‌ ఖాతా హ్యాక్‌ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తన వ్యక్తిగత సమాచారం, స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు అసలేం జరిగిందని షాక్‌కు గురయ్యారు. కానీ అయితే ఇదంతా నిజంగా జరగలేదని తెలుస్తోంది. కేవలం ఓ షో ప్రమోషన్ కోసం దీనిని షూట్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. 

టాలీవుడ్ హీరోలు రానా , వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్‌లో రానా.. సెలబ్రిటీల సమస్యలు తీర్చే పాత్రలో కనిపించారు. తాజాగా మృణాల్‌ ఠాకూర్  రానానాయుడు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వీడియో రిలీజ్ చేశారు. 
ఆ వీడియోలో 'తన మెయిల్‌ ఖాతా హ్యాక్‌కు గురైందని.. ఏం చేయాలో తెలియక రానా నాయుడుని సంప్రదించానని చెప్పుకొచ్చింది. రానా సాయంతోనే సమస్య పరిష్కారించారని తెలిపింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అధిగమించాలో తెలియాలంటే రానా నాయుడు చూడాలని సలహా ఇచ్చింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా..  ఇప్పటికే ఈ సిరీస్‌ ప్రమోషన్లలో జాన్వీకపూర్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే.  


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)