Breaking News

లస్ట్‌ గురించి బోల్డ్‌ కామెంట్‌ చేసిన సీతారామం బ్యూటీ

Published on Fri, 06/30/2023 - 13:49

2018లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'లస్ట్‌ స్టోరీస్‌' మంచి విజయం సాధించింది . దానికి కొనసాగింపుగా తాజాగా వచ్చిందే ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’. ఇందులో తమన్నా, మృణాల్‌ ఠాకూర్‌, కాజోల్‌ వంటి అగ్ర కథానాయకలు నటించడం విశేషం.  గురువారం (జూన్‌ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరిస్‌ ప్రధానంగా యూత్‌నే టార్గెట్‌ చేసిందనే చెప్పవచ్చు.  ఇందులో వేద (మృణాల్‌ ఠాకూర్‌) అర్జున్‌ (అంగద్‌ బేడీ) ఇరువురు మెప్పిస్తారు. వేద బామ్మగా నీనా గుప్త  క్యారెక్టర్‌ కూడా మెప్పిస్తుంది. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని సలహాను వేద బామ్మ ఇవ్వడంతో సీరిస్‌ ఆసక్తి పెంచుతుంది. 

(ఇదీ చదవండి: రాకేశ్‌ మాస్టర్‌ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే)


శృంగారం, కామం గురించి పరిణతి చెందిన సంభాషణ చేయడంలో తప్పులేదంటూ తాజాగా ఈ సీరిస్‌ గురించి మృణాల్‌ ఠాకూర్‌ ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో ఓపెన్‌గా సంభాషణలు జరగడం ఎంతో ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్న వాళ్లతో దీనిపై మాట్లాడటం అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం. ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగా వివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వాళ్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరు' అని మృనాల్ చెప్పింది.

(ఇదీ చదవండి: Ram Charan-Upasana: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ గిఫ్ట్‌)

‘సీతారామం’తో అందరికీ ఫేవరేట్‌ హీరోయిన్‌గా మారిపోయిన మృణాల్‌ ఠాకూర్‌ పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండతో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు  నానితో కూడా ఓ సినిమాతో బిజీగా ఉంది ఈ బ్యూటీ.


Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)