Breaking News

తెలుగు వారికి 'సాష్టాంగ నమస్కారం' చేసిన మృణాల్ ఠాకూర్

Published on Wed, 04/03/2024 - 07:31

మృణాల్‌ ఠాకూర్‌.. తొలి చిత్రం 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకుల మది దోచి ఇక్కడ వరుస సినిమాలు చేస్తుంది. మొదటి సినిమాతోనే తెలుగింటి అమ్మాయిగా తనను అంగీకరించిన టాలీవుడ్‌ ప్రేక్షకుల పట్ల తనూ ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఉంటుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకుల పట్ల తన ప్రేమ,గౌరవాన్ని చూపుతుంది.

తాజాగా  ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ స్టేజీపైనే సాష్టాంగ నమస్కారం చేసింది. 'నన్ను అందరూ మీ తెలుగమ్మాయిగా అంగీకరించారు కాబట్టే నేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత ప్రేమను మీరు నాపై చూపిస్తున్నారు. మీ అందరిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో కలిగి ఉంటాను. తెలుగు వారందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది.

ఫ్యామిలీస్టార్‌ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో 'ఇందు'గా మీ ముందుకు వస్తున్నాను. మొదటి 15 రోజులు ఈ పాత్ర చాలా ఇబ్బంది అనిపించింది. కానీ తర్వాత ఈ పాత్ర నాకన్నా ఎవరూ బాగా చేయలేరని అనిపించింది. విజయ్‌ దేవరకొండతో సినిమా చేయాలని ప్రతి హీరోయిన్‌ అనుకుంటుంది. కానీ ఫ్యామిలీస్టార్‌తో నాకు ఆ అవకాశం దక్కింది. అలాగే దిల్‌ రాజు గారితో ఇది నాకు రెండో సినిమా.. అవకాశం వస్తే మూడో సినిమా కూడా చేయాలని ఉంది. ఈ సినిమాను మా ఫ్యామిలీస్టార్‌ అయిన మా నాన్నగారికి డెడికేట్‌ చేస్తున్నాను.' అని మృణాల్ పేర్కొంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)