జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ
మిస్టర్ దెయ్యం షురూ
Published on Sat, 10/24/2026 - 04:40
విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మిస్టర్ దెయ్యం’. సంజన అన్నే దర్శకత్వంలో శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ పతాకంపై వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి అలీ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో మంచు మనోజ్ క్లాప్ ఇచ్చారు.
ఈ సన్నివేశానికి దర్శకుడు విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు, నటుడు–సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందించారు. అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడనటువంటి హారర్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఇదొక బెస్ట్ హారర్ మూవీగా నిలుస్తుంది’’ అని చెప్పారు. ‘‘మా ‘మిస్టర్ దెయ్యం’ చిత్రాన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సంజన అన్నే. ఇంకా సిరి చౌదరి, ఖయ్యూమ్, పింగ్‌పాంగ్ సూర్య మాట్లాడారు.
Tags : 1