Breaking News

సినీ దర్శకుడు ఆత్మహత్య

Published on Sun, 07/14/2024 - 12:57

సినీ దర్శకుడు రవిశంకర్‌ (63) చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య పత్రికలో కథారచయితగా జీవితాన్ని ప్రారంభించిన రవిశంకర్‌ ఆ తరువాత దర్శకుడు కె.భాగ్యరాజ్, దర్శకుడు విక్రమన్‌ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. కాగా శరత్‌కుమార్, దేవయాని జంటగా విక్రమన్‌ దర్శకత్వంలో రూపొందిన సూర్యవంశం చిత్రానికి రవిశంకర్‌ సహాయ దర్శకుడిగా పనిచేయడంతోపాటు, అందులోని రోసాపూ అనే సూపర్‌హిట్‌ పాటను రాశారు. 

కాగా నటుడు మనోజ్‌ భారతీరాజా హీరోగా నటించిన వర్షమెల్లామ్‌ వసంతం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని అన్ని పాటలను రవిశంకరే రాశారు. అయితే ఆ తరువాత ఈయనకు మరో అవకాశం రాలేదు. కాగా అవివాహితుడైన రవిశంకర్‌ స్థానిక కేకే.నగర్‌లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారు. 

అయితే సినిమా అవకాశాలు లేక, పేదరికంలో జీవిస్తున్న ఈయన మానసిక వేదనతో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రవిశంకర్‌ భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈయన ఆత్మహత్యకు కారణాలపై  పోలీసులు విచారణ జరుపుతున్నారు. రవిశంకర్‌ మర ణం కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)