Breaking News

కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!

Published on Thu, 05/25/2023 - 21:38

సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్‌ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

(ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?)

అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

(ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్)

అసలేం జరిగిందంటే..

సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ  మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)