Breaking News

కల్కి 2898 ఏడీ.. కారులో కూర్చొని సినిమా చూసేయొచ్చు!

Published on Mon, 06/24/2024 - 16:10

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఆ పేరే వినిపిస్తోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆ సినిమా కోసమే ఆడియన్స్‌ ఎదురు చూస్తున్నారు. అదే యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్- నాగ్ అశ్విన్‌ కాంబోలో వస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్‌ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే కల్కి సినిమాకు సంబంధించి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ టికెట్స్ కోసం ఫ్యాన్స్‌ ఎగబడుతున్నారు. మూవీ టికెట్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే హాట్‌ కేకుల్లా అ‍మ్ముడవుతున్నాయి. అయితే ముంబయిలో కల్కి సినిమా టికెట్‌ ధరలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.  ముంబయిలోని మల్టీప్లెక్స్‌లో కల్కి టికెట్‌ ధర ఏకంగా రూ.2000 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ముంబయి నగరంలోని మైసన్ పీవీఆర్‌: జియో వరల్డ్ డ్రైవ్-ఇన్‌ మల్టీప్లెక్స్‌లో ఈ ధరను నిర్ణయించారు. అయితే ప్రత్యేక డ్రైవ్-ఇన్ థియేటర్లో ప్రేక్షకులు తమ సొంత స్నాక్స్‌తో పాటు తమ కారులోనే కూర్చొని సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. ముంబయిలో రెండో అత్యంత ఖరీదైన టిక్కెట్ ఐనాక్స్: ఇన్సిగ్నియాలో వర్లీస్ అట్రియా మాల్‌లో రాత్రి 9:30 గంటలకు షో టిక్కెట్ ధర రూ.1,760 గా నిర్ణయించారు. దీంతో కల్కి టికెట్ ధరలు చూసిన అభిమానులు ఇది ప్రభాస్ రేంజ్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇంత ధర వెచ్చించి సినిమా చూడాలా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. కల్కి మూవీ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)