Breaking News

మోహన్ లాల్ సినిమాకు పైరసీ బెడద.. ఏకంగా టూరిస్ట్ బస్సులోనే!

Published on Tue, 05/06/2025 - 11:07

మలయాళ సూపర్ స్టార్‌ మెహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'తుడరుమ్'. ఈ చిత్రంలో శోభన హీరోయిన్‌గా కనిపించింది. మలయాళంలో హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి జతకట్టారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లతో మలయాళ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్ రావడంతో అభమానులు క్యూ కడుతున్నారు.

సినీ ఇండస్ట్రీని ఎప్పటినుంచో పట్టి పీడిస్తోన్న పైరసీ భూతం ఈ సినిమాను వదల్లేదు. గతంలో గేమ్ ఛేంజర్‌ మూవీలాగే ఈ చిత్రాన్ని కూడా ఓ టూరిస్ట్‌ బస్సులో ప్రదర్శించారు. కేరళలోని మలప్పురం నుంచి వాగమోన్‌కు వెళ్తున్న టూరిస్ట్ బస్సులో ఈ మూవీ ‍ప్రదర్శించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీంతో ఈ మూవీ నిర్మాత ఎం రంజిత్‌ లీగల్‌ చర్యలకు సిద్ధమయ్యారు. ఆయన వెంటనే సైబర్ సెల్ ప్రధాన కార్యాలయంలో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ మంత్రి సాజి చెరియన్..  సరైన ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా..  ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి తరుణ్‌ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 10 రోజుల్లోపు ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ సక్సెస్‌గా కొనసాగుతోంది. అంతేకాకుకండా ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతకుముందే  మోహన్ లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ రూ. 246 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తుడరుమ్.. ఎల్2: ఎంపురాన్, మంజుమ్మెల్ బాయ్స్,  2018 చిత్రాల తర్వాత  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ మలయాళ చిత్రంగా నిలిచింది.

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)