Breaking News

మోహన్‌ లాల్‌ ఇంట తీవ్ర విషాదం

Published on Tue, 12/30/2025 - 15:54

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి(90) కన్నుమూశారు. గతకొంత కాలంగా పక్షవాతం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.  ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

శాంతి కుమారి భర్త, మాజీ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథన్ నాయర్ 2005లో మరణించారు. వారి పెద్ద కుమారుడు ప్యారేలాల్ కూడా 2000లో మృతిచెందారు. 

 మోహన్‌లాల్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత కూడా ముందుగా తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తల్లి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నట్లు మోహన్‌లాల్‌ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తన విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడేవారని తెలిపారు. 

శాంతకుమారి మరణవార్త విని పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. మమ్ముట్టి దంపతులు మోహన్‌లాల్‌ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)