Breaking News

నేను చెడ్డ నటుడిని కాదు, కాంతారలో ఛాన్స్‌ ఇవ్వండి: మోహన్‌లాల్‌

Published on Sun, 03/30/2025 - 11:10

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి (Rishab Shetty) కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కాంతార. రిషబ్‌ హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా 2022లో రికార్డులు సృష్టించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు, ఉత్తమ నటుడు, ఉత్త పాపులర్‌ ఫిలిం విభాగంలో రెండు జాతీయ అవార్డులు అందుకుంది.

కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్‌?
ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్‌ 1 తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌ 2న విడుదల కానుంది. అయితే ఈ ప్రీక్వెల్‌లో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో నటించనున్నట్లు ఆ మధ్య ఓ రూమర్‌ తెగ వైరల్‌ అయింది. తాజాగా ఈ రూమర్‌పై మోహన్‌లాల్‌ స్పందించాడు. దయచేసి నన్ను కాంతార సినిమాలో భాగం చేయమని మీరే అడగండి. నాకు ఒక పాత్ర ఇవ్వండి. నాకు తెలిసి నేనేమీ చెడ్డ నటుడిని కాదు అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ఎంపురాన్‌ సినిమాతో మరో హిట్‌
ఇకపోతే మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఎల్‌2: ఎంపురాన్‌ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది.

చదవండి: హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)