Breaking News

విజయ్‌ ‘లియో’కి బాయ్‌కాట్‌ సెగ.. కారణం ఆ గొడవేనా?

Published on Sun, 09/24/2023 - 12:42

వారసుడు లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. విక్రమ్‌తో కమల్‌హాసన్‌కు భారీ విజయాన్ని అందించిన లోకేశ్‌ కనగరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత విజయ్‌కి జోడీగా త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. తమిళ్‌ ప్రేక్షకులే కాదు ఆలిండియా సినీ అభిమానులు సైతం లియో చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి కేరళలో బాయ్‌కాట్‌ సెగ తగిలింది

ట్రెండింగ్‌లో #KeralaBoycottLEO హ్యాష్‌ట్యాగ్‌
విజయ్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, కన్నడ, కేరళలో డబ్‌ అయి విజయం సాధించాయి. అందుకే లియో చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలతో పాటు పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తున్నారు. కేరళలో కూడా విజయ్‌ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేరళలో లియో సినిమాకు వ్యతిరేకత ఎదురవుతుంది. లియో సినిమాను బహిష్కరించాలంటూ కొంతమంది కేరళ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో.. #KeralaBoycottLEO హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌(ట్విటర్‌)లో ట్రెండ్‌ అవుతోంది. మోహన్‌లాల్‌ అభిమానులే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

కారణమేంటి?
పాన్‌ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్‌ ఉన్న లియో సినిమాకు కేరళలో వ్యతిరేకత ఎదురవడానికి మోహన్‌లాల్‌ అభిమానులే కారణం. వాళ్లు అలా ట్రోల్‌ చేయడానికి కూడా కారణం ఉంది. 2014లో మోహన్‌లాల్‌, విజయ్‌ కలిసి ‘జిల్లా’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం విడుదలయ్యాక కొంతమంది విజయ్‌ ఫ్యాన్స్‌.. మోహన్‌లాల్‌ నటనను అవమానిస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో ఆ ట్వీట్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. తమ హీరోని అవమానించారు కాబట్టే.. విజయ్‌ సినిమాను ఇక్కడ ఆడనివ్వమని మోహల్‌లాల్‌ ఫ్యాన్స్‌  చెబుతున్నారు.  విజయ్‌కి వ్యతిరేకంగా  #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాయ్‌కాట్‌ హీట్‌ తగిలితే మాత్రం నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)