Breaking News

దోశె కింగ్‌గా...

Published on Mon, 09/08/2025 - 00:02

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ దోశె కింగ్‌గా మారనున్నారట. వెండితెరపై ఈ హీరోని ఇలా మార్చనున్న దర్శకుడు ఎవరో కాదు... సూర్యతో ‘జై భీమ్‌’ వంటి ఆలోచన రేకెత్తించే సినిమా తీసి, విజయం సాధించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌. శరవణ భవన్‌ హోటల్‌ యజమాని రాజగో పాల్‌ జీవితం ఆధారంగా జ్ఞానవేల్‌ ఓ కథ తయారు చేశారని కోలీవుడ్‌ టాక్‌. ఈ కథని మోహన్‌లాల్‌కి వినిపించారట. ఆయనకు నచ్చి, ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. శరవణ భవన్‌ అధినేతగా రాజగో పాల్‌ గొప్ప పేరు సం పాదించుకున్నారు.

చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి చేరుకున్న ఆయన జీవితంలో ‘డార్క్‌ షేడ్‌’ కూడా ఉంది. ఓ హత్య కేసులో జీవిత ఖైదుగా ఆయనకు శిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఖైదీగా ఉన్న కొద్ది రోజులకే రాజగో పాల్‌ గుండె పోటుతో మరణించారు. రాజగో పాల్‌ సాధారణ వ్యా పారవేత్తగా మొదలై, ఎంతో ఎత్తుకి ఎదిగి, హత్య కేసులో ఇరుక్కుని డౌన్‌ ఫాల్‌ అయినంతవరకూ సినిమాలో చూపించనున్నారట జ్ఞానవేల్‌. సో... ఈ సినిమాలో మోహన్‌లాల్‌ని డార్క్‌ షేడ్‌లోనూ చూసే అవకాశం ఉందన్నమాట. ‘దోశె కింగ్‌’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూ పొందించనున్నారట. ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)