మోహన్‌లాల్‌కు కలిసిరాని డిసెంబర్‌.. డిజాస్టర్‌ తప్పదా!

Published on Sat, 12/27/2025 - 18:40

యంగ్‌ హీరోలను సైతం అబ్బురపరిచేలా వరుస విజయాలు అందుకున్నాడు సీనియర్‌ హీరో మోహన్‌లాల్‌. ఒకటా రెండా.. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ హిట్లే! కానీ చివరగా ఓ డిజాస్టర్‌ సినిమాతో 2025కి ముగింపు పలుకుతున్నాడు. అదే విషాదకరం! మరో విషయమేంటంటే.. డిసెంబర్‌లో రిలీజైన సినిమాలు ఆయనకు అస్సలు అచ్చిరావడం లేదు! అదెలాగో ఓసారి చూసేద్దాం...

అన్నీ హిట్లే..
తెలుగులో హీరోలు ఏడాదికో, రెండేళ్లకోసారో సినిమా చేస్తారు. కానీ, మలయాళంలో అలా కాదు.. వాళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలైనా ఫటాఫట్‌ షూట్‌ చేస్తుంటారు, ఆ వెంటనే రిలీజ్‌ చేస్తారు. అలా 2025లో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఎల్‌ 2: ఎంపురాన్‌, తుడరుమ్‌, హృదయపూర్వం.. బాక్సాపీస్‌ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టి హిట్లుగా నిలిచాయి. కానీ రూ.70 కోట్లు పెట్టి తీసిన వృషభ మూవీ మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా చతికిలపడింది. మొదటిరోజు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.

లుక్‌పై విమర్శలు
అదేంటో కానీ డిసెంబర్‌ నెల మోహన్‌లాల్‌కు ఇటీవలి కాలంలో పెద్దగా కలిసిరావడం లేదు. 2018 డిసెంబర్‌ ఓడియన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్‌లాల్‌. కలెక్షన్స్‌పరంగా సినిమా మంచి హిట్టయినప్పటికీ మోహన్‌లాల్‌ లుక్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. 2021 డిసెంబర్‌లో రూ.100 కోట్ల బడ్జెట్‌ మూవీ మరక్కర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్‌లాల్‌. 

సగం కూడా రాలే!
ఈ సినిమా రిలీజ్‌కు ముందే మూడు జాతీయ అవార్డులు అందుకుంది. భారీ ఓటీటీ డీల్స్‌ వచ్చినా కూడా థియేటర్‌లోనే ముందుగా రిలీజ్‌ చేయాలని సినిమాటీమ్‌ పట్టుబట్టింది. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మరక్కర్‌ బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్‌లో సగం కూడా తిరిగి రాలేదు.

దర్శకుడిగా డిజాస్టర్‌
వందలాది సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించిన మోహన్‌లాల్‌ బరోజ్‌ చిత్రంతో దర్శకుడిగా మారాడు. 2024 డిసెంబర్‌ 25న విడుదలైన ఈ మూవీ ఘోరంగా చతికిలపడింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కలెక్షన్స్‌ రాబట్టింది.

ఈసారి కూడా పరాజయమే!
సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీ (డిసెంబర్‌ 25న) వృషభతో పలకరించాడు ఈ స్టార్‌ హీరో. కలెక్షన్స్‌ అంతంతమాత్రంగానే ఉన్నాయి. బుకింగ్స్‌ పేలవంగా ఉన్నాయి. దీంతో ఈసారి కూడా మళ్లీ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మరి మోహన్‌లాల్‌ ఈ డిసెంబర్‌ సెంటిమెంట్‌ ఎప్పుడు బ్రేక్‌ చేస్తాడో చూడాలి!

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)