Breaking News

బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. ఆ సినిమా రికార్డ్ సేఫ్!

Published on Tue, 04/08/2025 - 19:58

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఎల్‌2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్‌ టాక్ అందుకున్న ఈ మూవీ.. మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఈ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 257కు పైగా గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్‌ సాధించింది. ఈ వసూళ్లతో ఎల్2 ఎంపురాన్ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా నిలిచింది. అంతేకాకుండా మలయాళంలో ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమా 2018 మూవీ రికార్డ్‌ను మాత్రం అధికగమించలేకపోయింది. అయితే 2023లో విడుదలైన 2018 సినిమా కేరళ వ్యాప్తంగా రూ.88.7 కోట్లు రాబట్టగా.. ఎంపురాన్‌ ఇప్పటి వరకు కేవలం రూ.80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ విషయంలో 2018 మూవీని ఎల్‌2 ఎంపురాన్ దాటలేకపోయింది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)