Breaking News

జర్నలిస్ట్‌పై దాడి.. రంజిత్‌కు మోహన్‌బాబు పరామర్శ

Published on Sun, 12/15/2024 - 17:42

జర్నలిస్ట్ రంజిత్‌కు సీనీ నటుడు మోహన్‌ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్‌ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్‌ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్‌ కోరడంతో  మోహన్‌ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.  మోహన్‌ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించాడు. 

కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్‌ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్‌ బాబు కూడా కేసు పెట్టాడు.  మంచు మోహన్‌ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్‌ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్‌ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్‌ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్‌ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్‌ బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.  'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్‌ని కలిసి పరామర్శించాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)