Breaking News

హీరోగా మారిన విలన్‌.. తొలి చిత్రంతోనే ప్రయోగం!

Published on Fri, 07/31/2026 - 09:01

దక్షిణాది సినిమాలో విలక్షణ నటుడిగా రాణిస్తున్న తమిళ నటుడు మైమ్‌ గోపి. తమిళం, తెలుగు ,మలయాళం తదితర భాషల్లో వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న ఈయన తాజాగా కథానాయకుడుగా అవతారం ఎత్తబోతున్నారు. ఇంతకుముందు యువర్‌ పేకర్స్‌ అనే ఓటిటి సంస్థ అధినేత కిశోర్‌ ఆదిత్య పలు షార్ట్‌ ఫిలిమ్స్‌ రూపొందించారు. 

కాగా తాజాగా నటుడు మైమ్‌ గోపి హీరోగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంతోష్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఇది పలు సంచనాలతో కూడిన హారర్‌ కథా చిత్రంగా ఉంటుందని, కాలక్షేప కథాచిత్రమే కాకుండా మహిళల రక్షణ వంటి అంశాలతో సమాజానికి మంచి సందేశాత్మక కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత కిశోర్‌ ఆదిత్య పేర్కొన్నారు.

వైవిధ్య‌భరిత కథ, కథనాలు ముఖ్యంగా మహిళల రక్షణ, దానికి సంబంధించిన అవగాహన వంటి అంశాలు ఉండ‌డంతో తానే చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. చిత్ర షూటింగును ఊటీ, కొడైకానాల్‌ తదితర ఎత్తైన కొండ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. 

ఎలాంటి పాత్రలోనైనా నటించి తన ప్రతిభ చాటుకుంటున్న నటుడు మైమ్‌ గోపి ని ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేయటం గర్వ కారణంగా  పేర్కొన్నారు.. చిత్ర టైటిల్‌ను, ఇందులో నటించే కథానాయకి, ఇతర నటినటంలు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. మొత్తానికి తొలి చిత్రంతోనే మైమ్‌ గోపి ఓ ప్రయోగం చేస్తున్నాడు. మరి హీరోగా నిలదొక్కుకుంటాడా, లేదా అనేది సినిమా రిలీజ్‌ తర్వాత తెలుస్తుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)