Breaking News

సిల్వర్‌ స్క్రీన్‌ మీదకు మరో షార్ట్ ఫిల్మ్ హీరో

Published on Thu, 04/06/2023 - 11:50

మీటర్‌ సినిమాతో తన కల నెరవేరిందంటున్నాడు నటుడు కుమార్‌ కాసారం. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ‘మీటర్‌’ సినిమాలో కుమార్‌ కాసారంకు మంచి పాత్ర లభించింది. యూట్యూబ్‌లో కుమార్‌  షార్ట్ ఫిల్మ్‌ చూసి ఇంప్రెస్ అవ్వడంతో దర్శకుడు రమేశ్‌ ‘మీటర్‌’లో నటించే అవకాశం ఇచ్చారట. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కిరణ్‌ మాట్లాడుతూ.. కుమార్‌ కాసారంపై ప్రశంసలు కురించాడు. అతనితో కలిసి చేసిన షార్ట్‌ ఫిల్మ్‌ జర్నీని గుర్తు చేసుకుంటూ.. కుమార్‌ చాలా ప్రతిభావంతుడని కితాబిచ్చాడు. ‘మీటర్‌’ ప్రిరిలీజ్‌ తర్వాత తనకు వరుస ఆఫర్లు వస్తున్నాయని కుమార్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ఓ చిత్రాన్ని పూర్తి చేశానని.. త్వరలోనే ఓ కొత్త బ్యానర్‌లో మరో చిత్రాన్ని చేయబోతున్నట్లు వెల్లడించారు. 

నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ‘కుమార్ కాసారం’కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ, సినిమాలపై అతని ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. సినిమా పరిశ్రమలో వృత్తిని కొనసాగించడానికి తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. మజిలీ, ఓ బేబీ, సర్ & కొండ వంటి సినిమాల్లో యాక్టర్ గా నిడివి తక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు సైన్‌ చేస్తున్నాడు. మరి షార్ట్ ఫిల్మ్ హీరో సిల్వర్‌ స్క్రీన్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)