Breaking News

నటుడు సంతానంతో మేఘా ఆకాష్‌ రొమాన్స్‌!

Published on Tue, 02/07/2023 - 12:04

తమిళసినిమా: సంతానంతో రొమాన్స్‌ చేయడానికి నటి మేఘా ఆకాష్‌ సిద్ధమయ్యారు. సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వడకుపట్టి రామసామి’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఇంతకుముందు సంతానం హీరోగా డిక్కీలూన అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థపై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం వడకుపట్టి రామసామి. కార్తీక్‌ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. నటుడు జాన్‌ విజయ్‌ ఎంఎస్‌ భాస్కర్, రవి మరియ, మొటై రాజేంద్రన్, నిళల్గల్‌ రవి, శేషు, ప్రశాంత్, జాక్విలిన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి శాన్‌ రోల్డెన్‌ సంగీతాన్ని, దీపక్‌ చాయాగ్రహణంను అందిస్తున్నారు. తాజాగా కథానాయకిగా మేఘా ఆకాష్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్‌ సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా మేఘా ఆకాష్‌ను కోలీవుడ్‌లో చూసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న యాదూమ్‌ ఊరే యావరుమ్‌ కేళీర్, మానై పిడిక్కాద మనిదన్, సింగిల్‌ శంకరుమ్‌ స్మార్ట్‌ పోన్‌ సిమ్రానుమ్‌ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా వడకు పట్టి రామసామి చిత్రంలో ఈమె డాక్టర్‌గా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోందని చెప్పారు. ఈ చిత్రానికి వివేక్‌ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)