రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన మెగాస్టార్‌.. ఒక్కో సినిమాకి ఎంతంటే..

Published on Thu, 02/02/2023 - 13:45

చాలా కాలం తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. అంతకు ముందు నటించిన చిత్రాలలో ఆచార్య బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తాపడగా.. గాడ్‌ఫాదర్‌ మంచి టాక్‌ సంపాదించుకున్నప్పటికీ బ్రేక్‌ ఈవెన్‌ మాత్రం సాధించలేదు. అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య మాత్రం భారీ విజయాన్ని సాధించింది.

రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు  రూ.250 కోట్లపై పైగా వసూళ్లను సాధించి మెగాస్టార్‌ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.

బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో చిరంజీవి తన రెమ్యునరేషన్‌ అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. పలు వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. వాల్తేరు వీరయ్య సినిమా కోసం రూ.50 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట చిరంజీవి.

అలాగే ప్రస్తుతం నటిస్తున్న బోళా శంకర్‌ చిత్రానికి కూడా అంతే పారితోషికం అందుకున్నాడట. కానీ ఈ చిత్రం తర్వాత నటించబోయే సినిమాలకు మాత్రం రూ.100 కోట్లు రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నారట. తన మార్కెట్‌కు తగ్గట్టుగా పారితోషికం తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నాడట. బోళా శంకర్‌ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)