Breaking News

చిరంజీవి మంచి మనసు.. కష్టాల్లో ఉన్న కెమెరామెన్‌కి సాయం

Published on Thu, 02/02/2023 - 12:53

మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం అందించడంలో ముందుండే చిరంజీవి తాజాగా మరో సినీ కళాకరుడికి చేయూతనందించారు. సీనియర్‌ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ ఎంజిఆర్‌, రజినీకాంత్‌, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున .. ఇలా ఎంతోమంది హీరోలతో దేవరాజ్‌ పనిచేశారు. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సీనియర్‌ కెమెరామెన్‌ దేవరాజ్‌ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్‌, ఆయన కొడుకును  పిలిపించి రూ. 5లక్షల చెక్‌ అందించి సహాయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు చిరు ఫ్యాన్స్‌ నెట్టింట షేర్‌ చేయడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. కాగా చిరంజీవి నటించిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు దేవరాజ్‌ కెమెరామెన్‌గా పనిచేశారు.


 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)