Breaking News

‘లక్కీ’ హీరోయిన్‌.. వరుస ఫ్లాపులు.. తగ్గని ఆఫర్స్‌

Published on Sun, 12/29/2024 - 12:23

మాములుగా హీరోహీరోయిన్లకు ఫ్లాప్‌ వస్తే ఆఫర్స్‌ తగ్గిపోతాయి. స్టార్‌ హీరోలకు ఇందులో మినహాయింపు ఉంటుంది. వాళ్లకు ఫ్లాప్‌ వచ్చినా కొత్త సినిమాలకు కొదవ ఉండదు. కానీ హీరోయిన్ల పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది. స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ.. ఫ్లాప్‌ వస్తే పక్కన పెట్టేస్తుంటారు. కానీ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )కి వరుస ఫ్లాపులు వచ్చినా..ఆఫర్స్‌ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. హిట్‌ 2తో హిట్‌ కొట్టింది. 

ఆ తర్వాత వరుస ఆఫర్స్‌ వచ్చాయి. ఈ ఏడాది ఏకంగా ఆరు చిత్రాల్లో నటించింది. అయితే వాటిల్లో లక్కీ భాస్కర్‌ మినహా మిగతా చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇటీవల వచ్చిన మట్కా, మెకానిక్‌ రాకీ చిత్రాలు భారీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో మీనాక్షి పని అయిపోయిందని అనుకున్నారు అంతా. ఇక ఆమె తెలుగు తెరకు దూరమైపోతుందని ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. 

కానీ టాలీవుడ్‌ మాత్రం ఇప్పటికీ మీనాక్షిని ‘లక్కీ’గానే చూస్తోంది. ఫ్లాపులను పట్టించుకోకుండా ఆమెకు అవకాశాలు అందిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో మీనాక్షి హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏంటో తెలియదు కానీ శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకున్నారు. 

ఇక ఇప్పటికే ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. సంకాంత్రి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. అనగనగా ఒక రాజుతో పాటు మరో రెండు  సినిమాల్లో మీనాక్షి హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా మీనాక్షి మూడు, నాలుగు చిత్రాలతో అలరించబోతుంది. 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)