Breaking News

ఆ ట్రోల్స్‌ తట్టుకోలేక డ్రిపెషన్‌లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి

Published on Wed, 01/08/2025 - 09:01

సినిమా నటీనటులకు ట్రోలింగ్‌ అనేది మాములే. ఏదో ఒక విషయంలో వారిని ట్రోల్‌ చేస్తునే ఉంటారు. ఇక గాసిప్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. పర్సనల్‌ విషయాల్లోనూ చాలా పుకార్లు సృష్టిస్తుంటారు. కానీ కొంతమంది హీరోహీరోయిన్లు వీటిని పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. మరికొంతమంది మాత్రం సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని భరించలేకపోతారు. భయపడతారు..బాధ పడతారు..డిప్రెషన్‌లోకి వెళ్తారు. హీరోయిన్‌ మీనాక్షి ఈ కేటగిరిలోకే వస్తుంది. సోషల్‌ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌ కారణంగా తాను మనస్థాపానికి గురయిందట. వారం రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లారట. ఈ విషయాన్ని స్వయంగా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )నే చెప్పింది.

‘ది గోట్‌’పై ట్రోలింగ్‌!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(vijay), వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ది గోట్‌’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ) గతేడాది సెప్టెంబర్‌ 5న విడుదైన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్‌ డ్రామా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, శివకార్తికేయన్, త్రిష అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయ్యింది. ఈ చిత్రం విషయంలో మీనాక్షిపై ట్రోలింగ్‌ జరిగింది. 

ఇందులో కొడుకుగా నటించిన విజయ్‌ పాత్రను ఏఐ టెక్నాలజీలో రూపొందించారు. ఈ పాత్రకు జంటగా నటి మీనాక్షి చౌదరి నటించారు. రిలీజ్‌ తర్వాత మీనాక్షి పాత్రపై నెటిజన్స్‌ విరుచుకుపడ్డారు. ఆమెను దారుణంగా ట్రోల్‌ చేస్తూ వీడియోలను షేర్‌ చేశారు. అవి చూసి మీనాక్షి చాలా బాధపడిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ.. ‘‘విజయ్‌ హీరోగా వచ్చిన ‘ది గోట్‌’ విడుదలైన తర్వాత నన్ను చాలా మంది ట్రోల్‌ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డా. వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లా. తర్వాత ‘లక్కీ భాస్కర్‌’ విడుదలైంది. ఆ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. అందులో నా నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మంచి సినిమాలపై దృష్టిపెట్టాలని అర్థం చేసుకున్నా’ అని చెప్పారు.

‘సంక్రాంతి..’తో బిజీ బిజీ
ప్రస్తుతం మీనాక్షి చౌదరి నటించిన‘సంక్రాంతికి వస్తున్నాం’(sankranthiki vastunam Movie) సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఐశర్వర్య రాజేశ్‌ మరో హీరోయిన్‌. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మీనాక్షి ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో చేస్తున్నారు మీనాక్షి. దానికి గల కారణం కూడా చెప్పారు. ‘గతేడాది ఆరు సినిమాలు చేశాను. నెలకో సినిమా రిలీజ్‌ అయింది. షూటింగ్‌ కారణంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే సమయం దొరకలేదు. ఈ సారి మాత్రం కాస్త గ్యాప​్‌ దొరికింది. అందుకే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాను’ అని చెప్పింది. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)