Breaking News

బయ్యర్లకు రూ. 4 కోట్లు రిటర్న్‌ చేసిన నిర్మాత?

Published on Thu, 09/11/2025 - 08:31

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన మజాకా (Mazaka) సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే, ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా కనెక్ట్‌ కాలేదు. దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజేశ్‌ దండ నిర్మించారు. రావు రమేశ్‌, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అయితే, ఈ సినిమా చాలామంది బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. ఎంత పెద్ద స్టార్‌ హీరో సినిమా అయినా సరే బయ్యర్లు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్మాతలతో ఢీల్‌ సెట్‌ చేసుకుంటున్నారు. సినిమాకు భారీ నష్టాలు వస్తే కొంత నిర్మాతల నుంచి రిటర్న్‌ ఉండేలా ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు.

మజాకా మూవీని కొనుగోలు చేసిన బయ్యర్స్‌ను నిర్మాత రాజేశ్‌ దండ ఆదుకున్నారంటూ ఒక వార్త సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది. మజాకా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై  అంచనాలు పెరిగాయి. దీంతో నిర్మాతలు చెప్పిన ధరకు బయ్యర్స్‌ కొనుగోలు చేశారు. విడుదల తర్వాత కూడా సినిమా బాగుందని టాక్‌ వచ్చింది. కానీ, కమర్షియల్‌గా అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్‌ సాధించలేకపోయింది. దీంతో  బయ్యర్లు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టపోయారట. ఆ డబ్బు తిరిగివ్వాలని నిర్మాతను చాలారోజులుగా బయ్యర్తు అడుగుతూ వచ్చారట. అయితే, తాజాగా ఆ మొత్తాన్ని వారికి చెల్లించారని తెలుస్తోంది.

ప్రస్తుతం నిర్మాత రాజేశ్‌ దండ మరో సినిమాతో రానున్నారు.  కిరణ్‌ అబ్బవరంతో కే రాంప్‌ (K-Ramp) మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్‌ 18న విడుదల కానుంది. ఈ మూవీకి లైన్‌ క్లియర్‌ కావాలంటే బయ్యర్లతో ఉన్న వివాదం సెటిల్‌ చేసుకోవాలి.  ఈ క్రమంలోనే ఆయన వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చేశారని టాక్‌.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)