‘మరువ తరమా’ మూవీ రివ్యూ

Published on Fri, 11/28/2025 - 16:29

ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం ఫేం హరీష్ ధనుంజయ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మరువ తరమా.  అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి  చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించగా గిడుతూరి రమణ మూర్తి, NV విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. నేడు(నవంబర్‌ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఒకే ఆఫీస్‌లో పని చేసే రిషి ( హరీష్ ధనుంజయ్),  సింధు( అవంతిక ), అన్వీ (అతుల్య) చుట్టూ తిరిగే ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఇది. సింధుతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు రిషి. రిషి అంటే అన్వీకి చాలా ఇష్టం. కానీ సింధు అంటే అతనికి ఇష్టమని తెలుసుకొని తన ప్రేమ విషయాన్ని తనలోనే దాచేస్తుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న రిషి, సింధు ఓ కారణంగా విడిపోతారు. అదేంటి? విడిపోయిన సింధు మళ్లీ రిషి జీవితంలోకి ఎలా వచ్చింది? అన్వీ తన ప్రేమ విషయాన్ని రిషితో చెప్పిందా లేదా? చివరకు ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
ట్రయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగు తెరకు కొత్త కాదు. గతంలో ఇలాంటి చిత్రాలు చాలా వచ్చినా..ఇప్పటికే ఈ స్టోరీలకు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ప్రేక్షకుడిని కాస్త ఎంగేజ్‌ చేసేలా లవ్‌స్టోరీని రన్‌ చేస్తే చాలు..ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. దర్శకుడు చైతన్య వర్మ అదే ఫాలో అయ్యాడు. కథలో కొత్తదనం లేకపోయినా..కామెడీ, ఎమోషనల్‌ సీన్లతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండదు. కానీ పంచ్‌ డైలాగ్స్‌, కామెడీ సీన్లతో బోర్‌ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. 

ఇక సెకండాఫ్ ను పూర్తిగా కధ, కధనాలపైనే దృష్టి పెట్టాడు.  ఆడియన్స్ ను ఎమోషనల్ గా కథకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో కొంతవరకు సఫలం అయ్యాడు. తెరపై ప్రధాన పాత్రలను చూస్తుంటే.. మన చుట్టుపక్కల వారిని చూస్తున్నట్లు అనిపిస్తుంది. వారి మధ్య సాగే సన్నివేశాలు..మన జీవితంలోనూ లేదా మన స్నేహితుల జీవితంలోనూ చూసినట్లే అనిపిస్తుంది.  ‘అమ్మాయిల విషయంలో ఆప్షన్లు ఉంటాయి ఏమో కానీ అమ్మ విషయంలో ఆప్షన్స్ ఉండవు’, ‘అనుకున్నట్లు జరిగితే అది ప్రేమ ఎందుకు అవుతుంది’ లాంటి ఆకట్టుకునే డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమాలో సాగదీత సీన్లతో పాటు కొన్ని మైనసులు ఉన్నపటికీ.. డైలాగ్స్‌, నేపథ్య సంగీతం వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. మనకి తెలిసిన కథను అంతే అర్థమవంతంగా యదార్ద సంఘటనల ఆధారంగా జరిగిన కథ ఈ మరువ తరమా

ఎవరెలా చేశారంటే..  
రిషి పాత్రకు హరీష్ ధనుంజయ్ న్యాయం చేశాడు. తెరపై చూడడానికి చాలా బాగున్నాడు. నటనలోను ఈజ్ తో చేసాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అవంతిక చాలా బాగా నటించింది. అతుల్య పాత్ర పరిధి మేరకు నటించింది. రోహిణి కనిపించింది కాసేపైనా మంచి పాత్ర. భద్రమ్ రెండు మూడు సీన్లు మాత్రమే పరిమితం అయ్యాడు. దినేష్ పాత్ర చేసిన నటుడు హిలేరియస్ గా నవ్వించాడు.  

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ బుల్గానిన్ & ఆరిష్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. బీజీఎంతో పాటు పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- రేటింగ్‌: 2.5/5

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)