Breaking News

చిన్న వయసులో విగతజీవిగా మారిన నటుడు

Published on Sun, 06/22/2025 - 10:23

మరాఠీ నటుడు తుషార్‌ ఘడిగోయెంకర్‌ (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబై గోరెగావ్‌లోని అద్దెకుంటున్న ఫ్లాట్‌లో శుక్రవారం విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల నివేదిక ప్రకారం.. శుక్రవారం రోజు.. రామ్‌ మందిర్‌ రోడ్‌లో ఓ ఫ్లాట్‌లోని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌కాల్‌ వచ్చింది. 

అపస్మారక స్థితిలో?
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా తుషార్‌ నేలపై స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతడిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రంగుల ప్రపంచంలో రాణించాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన తుషార్‌కు పెద్దగా అవకాశాలు దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏడాది కాలంగా మద్యానికి బానిసయ్యాడని పోలీసులు చెప్తున్నారు. 

సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నటుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా తుషార్‌.. మరాఠీ సినిమాల్లోనే కాకుండా థియేటర్‌ ఆర్టిస్టుగానూ రాణించారు. ఘంట నాద్‌ ప్రొడక్షన్‌ పేరిట సొంతంగా ఓ మ్యూజిక్‌ వీడియో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆయన.. ఇలా చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

చదవండి: ప్రభాస్‌ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)