Breaking News

పోస్టర్‌ చూద్దాం.. ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్‌

Published on Thu, 03/23/2023 - 05:15

పండగ చేద్దాం.. పోస్టర్‌ చూద్దాం అన్నట్లు ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో కొన్ని పోస్టర్లను చూద్దాం. 

♦ వెంకటేశ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెడికల్‌ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్‌ వినిపిస్తోంది. 

♦  పల్లకి మోస్తున్నారు గోపీచంద్‌. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్‌ హయతి హీరోయిన్‌. టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. 


♦ నాగచైతన్య పోలీస్‌గా నటిస్తున్న యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజవుతుంది. 

♦  కల్యాణ్‌ రామ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా చిత్రం ‘డెవిల్‌: ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’. నవీన్‌ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. 

♦  ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో ట్రిపుల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు సుదీర్‌బాబు. దర్శక–నటుడు హర్షవర్థన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే పాత్రల్లో కనిపిస్తారు సుధీర్‌బాబు. సునీల్‌ నారంగ్, పుసూ్కర్‌ రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

♦ సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న మిస్టిక్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 21న విడుదల కానుంది. 

♦  వరుణ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘అర్జునదారి గాండీవ’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.  

♦  కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. 2012 యుగాంతం కాన్సెప్ట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మాత. 

♦  పోలీసాఫీసర్‌గా కిరణ్‌ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్‌’. అతుల్యా రవి హీరోయిన్‌గా నటించారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ల సమర్పణలో చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.  

♦  దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. పి. కిరణ్‌ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. 

♦  ‘రౌడీబాయ్స్‌’ ఫేమ్‌ ఆశిష్‌ హీరోగా రూపొందుతున్న  ద్వితీయ చిత్రం ‘సెల్ఫీష్ ’. ఈ చిత్రానికి విశాల్‌ కాశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్, సుకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్‌ బండ్రెడ్డి సహనిర్మాతలు. 

♦  రాయ్‌ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జనతా బార్‌’. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను రమణ మొగిలి, తిరుపతిరెడ్డి బీరం నిర్మించారు. ‘‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్‌ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని  చేస్తున్న సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.  

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)