Breaking News

దేశానికి సేవ చేస్తున్నావా.. బిగ్‌ జోక్‌ : హీరోయిన్‌పై ట్రోలింగ్‌

Published on Tue, 03/25/2025 - 13:39

బాలీవుడ్‌ బ్యూటీ మన్నారా చోప్రా (Mannara Chopra) ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక సంఘటన వల్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురైంది. ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తూ, జైపూర్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కకుండా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించింది. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసి, సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, తన పేరు పిలవకపోవడంతో విమానం ఎక్కలేకపోయానని చెప్పింది. 

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిపై కేకలు వేస్తూ, అరుస్తూ  మన్నారా చోప్రా రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో ప్రయాణికురాలు ఆమెకు మద్దతు పలుకుతూ..‘ఆమె పెద్ద సెలబ్రిటీ, దేశానికి సేవ చేస్తోంది’.. మీరు ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించింది.  

మన్నారా షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపిస్తే.. మరికొంతమంది విమర్శిస్తున్నారు.  ‘ఎయిర్‌లైన్ నిబంధనల ప్రకారం బోర్డింగ్ 30 నిమిషాల ముందు మూసివేస్తారు, ఆమె సకాలంలో రాకపోతే సిబ్బందిని నిందించడం సరికాదు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరికొందరు "ఆమె దేశానికి సేవ చేస్తోందని చెప్పడం హాస్యాస్పదం" అని, "ఇంత పెద్ద సెలబ్రిటీ ఎవరు? ఆమె ఏ సినిమాల్లో నటించింది?" అంటూ ఎగతాళి చేశారు. ‘ఇండిగో తరచూ ఇలాంటి పొరపాట్లు చేస్తుంది’ అని కొంతమంది, చాలా మంది ఆమె ప్రవర్తనను  ‘అతిగా ఉంది’ అని ట్రోల్ చేస్తున్నారు.

మన్నారా చోప్రా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ భాషల సినిమాల్లో నటించింది. తెలుగులో "ప్రేమ గీమ జాంత నై" చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత సునీల్‌తో "జక్కన్న", సాయి ధరమ్ తేజ్‌తో "తిక్క" వంటి సినిమాల్లో నటించింది. అలాగే "రోగ్" మరియు "సీత" చిత్రాల్లో కూడా కనిపించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)