మలయాళ ఏకైక సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' రికార్డ్‌..!

Published on Tue, 03/19/2024 - 14:40

మలయాళం సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్' చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు మలయాళ ఇండస్ట్రీలో ఏ సినిమా ఈ మార్క్‌ను అందుకోలేదు. దీంతో ఈ ఫీట్‌ సాధించిన ఏకైక సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' చరిత్రకెక్కింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది.

చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ మూవీ కేవలం 25 రోజుల్లోనే రూ. 200 కోట్లు కలెక్షన్స్‌ సాధించడం విశేషం. గతంలో ఏ  మలయాళ మూవీ ఈ ఘనతను అందుకోలేదు. ఈ చిత్రం తర్వాత '2018' సినిమా తర్వాత స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ. 180 కోట్ల వరకు కలెక్షన్స్‌ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్‌ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్‌ నటించిన 'మన్యం పులి' రూ. 150 కోట్లు కలెక్ట్‌ చేస్తే.. 'లూసిఫర్' రూ. 130 కోట్లు అందుకుంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'ప్రేమలు' ఇప్పటి వరకు రూ. 120 కోట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది.

మంజుమ్మెల్ బాయ్స్ కథ

2006లో రియల్‌గా జరిగిన ఓ  ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఏడాదిలో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితులు ఎలా కాపాడుతారన్నదే  'మంజుమ్మెల్ బాయ్స్' స్టోరీ. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)