మంజు వారియర్‌పై ఇష్టం వచ్చినట్లు చేతులు.. వీడియో వైరల్‌

Published on Sat, 05/03/2025 - 09:24

మలయాళ భామ మంజు వారియర్‌(Manju Warrier)కు  ఓ చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. అప్పటికే కారులో ఉన్న అభిమానుల కోసం మళ్లీ బయటకు వచ్చింది. దీంతో ఆమెకు షేక్ హ్యాండ్‌ ఇచ్చేందుకు చాలామంది ఎగబడ్డారు. ఆమెపై అసభ్యకరంగా చేతులు వేసేందుకు కొందరు ప్రయత్నించారు. దానిని గమనించిన ఆమె సున్నితంగానే అక్కడి నుంచి తప్పుకుంది. ఓ వ్యక్తికి సెల్ఫీ ఇచ్చి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

లూసిఫర్‌2 సినిమాతో రీసెంట్‌గా మంచి విజయాన్ని అందుకున్న మంజు వారియర్‌కు వరసు సినిమా అవకాశాలు వస్తున్నాయి. సోషల్‌మీడియాలో ఆమెకు భారీగా పాపులారటి పెరిగింది. దీంతో ఆమెకు పలు షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌ కోసం ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె బెంగళూరులోని మాల్ ఓపెనింగ్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసి వెళ్తున్న సమయంలో అభిమానులు చుట్టుముట్టడంతో కారులోంచి దిగి ఆపై వారిని పలకరించే ప్రయత్నం చేసింది.  దీంతో ఓ వ్యక్తి  ఆమె నడుమును పట్టుకుని లాగాడు. మరోకరు ఆమెను టచ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన మంజు వారియర్ కొంతమందితో సెల్ఫీలు దిగి అక్కడినుంచి వెళ్లిపోయింది.

సినిమా వాళ్లు అంటే పబ్లిక్ ప్రాపర్టీ అనేలా చాలామందిలో అభిప్రాయం ఉంటుంది. అందుకే ఇలా ఎగబడిపోతారు. ఆ సమయంలో వారికి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనేది కనీసం ఆలోచించరు.  ఒకవేళ ఫోటోల విషయంలో వారు తిరష్కరిస్తే ఎంత పొగరు అంటూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తారు. ఫ్యాన్సే కదా అని సెల్ఫీలు ఇస్తే ఇలాంటి చెత్త పనులకు రెడీగా ఉంటారు అంటూ కొందరు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)