Breaking News

రజనీకాంత్‌తో సినిమా చేశాక నాకు ఆఫర్లు రాలేదు: హీరోయిన్‌

Published on Thu, 03/30/2023 - 21:30

రజనీకాంత్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో బాబా ఒకటి. ఈ సినిమా ఫలితం ఎలాగున్నా చాలామంది ఇప్పటికీ దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. రజనీ కూడా బాబా చిత్రం తనకెంతో ప్రత్యేకమని అనేకసార్లు నొక్కిచెప్పాడు. ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్‌గా నటించింది. దీనికంటే ముందు ఆమె ఇండియన్‌, బాంబే, ఆలవందన్‌ వంటి పలు దక్షిణాది హిట్‌ చిత్రాల్లో నటించింది. అయితే బాబా తర్వాత తనకు సౌత్‌లో స్థానం లేకుండా పోయిందట.


ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బాబా నా చివరి తమిళ చిత్రం. ఆ రోజుల్లో ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఘోరంగా చతికిలబడింది. సౌత్‌లో నా కెరీర్‌ ముగిసినట్లే అనుకున్నా.. చివరికి నేను ఊహించిందే జరిగింది. బాబా తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అదేంటో కానీ విచిత్రంగా రీరిలీజ్‌ చేసినప్పుడు మాత్రం మంచి హిట్‌ కొట్టింది' అని చెప్పుకొచ్చింది.

మణిరత్నం బాంబే సినిమా గురించి చెప్తూ.. 'మొదట బాంబే సినిమా చేయకూడదనుకున్నాను. తల్లి పాత్రలో నటిస్తే కెరీర్‌ దెబ్బతింటుందని అందరూ హెచ్చరించారు. కానీ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా మాత్రం మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి నీకేమైనా తెలుసా అసలు? ఆయన సినిమా వద్దుంటున్నావంటే నీ అంత పిచ్చివాళ్లు ఇంకొకరు ఉండరు అని తిట్టాడు. అప్పుడు వెంటనే నా నిర్ణయాన్ని మార్చుకున్న అమ్మ, నేను చెన్నై వెళ్లిపోయాం. బాంబే సినిమా చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది' అని తెలిపింది. 1995లో వచ్చిన బాంబే మూవీ కల్ట్‌ క్లాసిక్‌ మూవీలో ఒకటిగా నిలిచింది. బాబా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి రజనీకాంతే స్వయంగా కథ అందించి, నిర్మించాడు. గతేడాది రజనీకాంత్‌ బర్త్‌డే సందర్భంగా బాబా రీరిలీజ్‌ చేయగా మంచి కలెక్షన్లు రాబట్టింది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)